శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లు
దర్శించుకున్న భక్తులు 62,449
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు కరోనా కేసులు ఉధృతం అవుతుందనే ఆందోళన ఉన్నప్పటికీ ఎక్కడా తగ్గడం లేదు. స్వామి వారిని నమ్ముకుంటే తప్పకుండా శుభం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం భక్త బాంధవులక
కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం విషయంలో ఒకింత శ్రద్ద పెట్టడం లేదన్న అభిప్రాయం భక్తుల్లో నెలకొంది. ఎంతో శ్రమకోర్చి వచ్చే భక్తులకు స్వామి వారి ప్రసాదం తీసుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది.
గతంలో దివంగత ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే భారీ ఎత్తున అన్నదానం కోసం నిధులు కేటాయించడం జరిగింది. ఆనాటి ఈవో దీనిపై ఎక్కువగా శ్రద్ద పెట్టారు. ఆ తర్వాత ఎల్వీ సుబ్రమణ్యం, అనిల్ కుమార్ సింఘాల్ లు సామాన్య భక్తులకు పెద్ద పీట వేసేందుకు ప్రయత్నం చేశారు.
కానీ ప్రస్తుతం కేవలం డబ్బులు ఉన్న వాళ్లకు, సినీ రంగానికి చెందిన వారికి, పొలిటికల్ లీడర్లకు , ఇతరులకు , వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక దర్శనం విషయానికి వస్తే స్వామి వారిని 62 వేల 449 మంది దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.