శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు
దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,649
తిరుమల – ప్రసిద్ద పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తుల తాకిడి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది ఈ అరుదైన పుణ్యక్షేత్రం. శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను కొలిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు కష్టాలు తొలిగి పోతాయని భక్త బాంధవుల ప్రగాఢ నమ్మకం.
కోట్లాది రూపాయలు , ఆభరణాలు భక్తులు కానుకలు, విరాళాల రూపేణా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాకుండా తమ పనులు జరిగితే స్వామి వారికి ఉచితంగా స్థలాలను దానంగా ఇస్తున్నారు భక్తులు. ఇక తిరుమల శ్రీవారిని 62 వేల 649 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది.
24 వేల 384 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. క్రిష్ణ తేజ గెస్ట్ హౌస్ దాకా భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న వారికి కనీసం 18 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ వెల్లడించింది.