శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు
దర్శించుకున్న భక్తులు 61,511
తిరుమల – తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి కొండపై కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు తరలి వస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. శ్రీవారి సేవకులు , టీటీడీ సిబ్బంది సహాయ పడుతున్నారు.
శ్రీనివాసుడిని 61 వేల 511 మంది భక్తులు దర్శించుకున్నారు. 20 వేల 777 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ కార్య నిర్వహణాధికారి ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు. స్వామి, అమ్మ వార్లకు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు వచ్చిందని తెలిపారు.
స్వామి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం దర్శన భాగ్యం 8 గంటలకు పైగా పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
ఇదిలా ఉండగా ఈనెల తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 16న పార్వేట ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోజు బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. సిఫారసు లేఖలు తీసుకునే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.