Saturday, April 5, 2025
HomeNEWSANDHRA PRADESHసంక్రాంతి వేడుక‌ల్లో జ‌గ‌న్

సంక్రాంతి వేడుక‌ల్లో జ‌గ‌న్

జల‌కు మంచి జ‌ర‌గాలి

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సంక్రాంతి వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. తాడేప‌ల్లి గూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, భార‌తీ రెడ్డి పాల్గొన్నారు. సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో దుస్తులు ధ‌రించారు.

ఈ సంద‌ర్బంగా అంద‌రికీ మంచి జ‌ర‌గాలంటూ సీఎం కోరారు. సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా సంబురాలు జ‌రిగాయి. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా చేశారు. పూర్తిగా పల్లె వాతావరణం, అభివృద్ది కార్యక్రమాలు ఉట్టి పడేలా ఏర్పాట్లు చేసింది ఏపీ ప్ర‌భుత్వం.

సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు అర్చకులు, గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, పిండి వంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు నిర్వ‌హించారు.

ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు జ‌రిగాయి. డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ.సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments