సంక్రాంతి వేడుకల్లో బాబు..పవన్
భోగి మంటల్లో జగన్ మేనిఫెస్టో
అమరావతి – తెలుగు వారి లోగిళ్లలో పండుగ శోభ సంతరించుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా కొనసాగుతోంది. భోగి ని పురస్కరించుకుని సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇదిలా ఉండగా ఈసారి రాష్ట్రంలో శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
రాజధాని ప్రాంతం మందడంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. వీరితో పాటు నారా లోకేష్ , నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రకటించిన మేనిఫెస్టోను పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భోగి మంటల్లో వేశారు.
ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇరు పార్టీల నేతలు. తమను అడ్డు కోవడం ఎవరి తరం కాదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. జగన్ రాక్షస పాలన ఇంకా కొన్ని రోజులేనని పేర్కొన్నారు.