కర్ణాటక..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా
హైదరాబాద్ – సాంఘిక సంక్షేమం వ్యయంలో తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందంజలో కొనసాగుతున్నాయి. గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 మనీ కంట్రోల్ విశ్లేషణ ప్రకారం బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి పేద ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు అధిక నిధులు కేటాయిస్తున్నాయి.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో అభివృద్ది సాధించేలా ప్రణాళికలు తయారు చేశారు. వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
ఇదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడంతో ప్రజలు మార్పు కోరుకున్నారు. సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. దీని కాల పరిమితి ఏడాది పూర్తయింది. ప్రధానంగా విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ సర్కార్.