సీఎం కామెంట్స్ ఎమ్మెల్సీలు సీరియస్
పదవికి తగిన వ్యాఖ్యలు కావవి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి తమ పట్ల చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించు కోవాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీలు (శాసన మండలి సభ్యులు) డిమాండ్ చేశారు. తాజాగా ఓ ఛానల్ తో జరిగిన సంభాషణలో కీలక వ్యాఖ్యలు చేశారు. గౌరవ ప్రదమైన శాసన మండలిని ఇరానీ కేఫ్ గా , ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా పోల్చారు. గతంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అడ్డగోలుగా నియమించిందని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్సీలు. వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని కోరారు. లేకపోతే కౌన్సిల్ ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రానికి ఒక బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడటం మంచి పద్దతి కాదని సూచించారు. ఈ సందర్భంగా సీఎంను ఇక నుంచి ఇలాంటి కామెంట్స్ చేయుకుండా మందలించాలని, అంతే కాకుండా ఆయన చేసిన దుందుడుకు మాటలను ఎథిక్స్ కమిటీ ముందు ఉంచాలని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ రాశారు.