సీట్ల సర్దుబాటుపై బాబు ఫోకస్
త్వరలో ఏపీలో శాసన సభ ఎన్నికలు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అధికారంలో ఉన్న వైసీపీ , ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అంటూ విమర్శల వర్షం కురుస్తోంది.
ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ , పవన్ నాయకత్వంలోని జనసేన పార్టీ కలిసికట్టుగా బరిలోకి దిగనున్నాయి. ఇదే విషయాన్ని బాబు, పవన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి 53 రోజుల పాటు ఏపీ స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు.
కండీషన్ బెయిల్ పై విడుదలయ్యారు చంద్రబాబు నాయుడు. ఆయనపై ఏపీ సీఐడీ ఏకంగా ఎనిమిది కేసులు నమోదు చేసింది. దీనిపై కూడా బెయిల్ తెచ్చుకున్నారు. ఈ సందర్బంగా విడుదలైన అనంతరం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఓడంచాలని కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా అవసరమైతే సీట్లు కోల్పోయేందుకు కూడా సిద్దపడ్డారు.
ఈ మేరకు జనసేన పార్టీతో టీడీపీ కలిసి పని చేస్తుందన్నారు చంద్రబాబు నాయుడు. వివ్వసనీయ సమాచారం మేరకు జనసేన 50 శాసన సభ సీట్లతో పాటు 4కు పైగా లోక్ సభ స్థానాలు కావాలని చంద్రబదబుతో అడిగినట్లు సమాచారం. మొత్తంగా జగన్ ను పడగొట్టాలంటే చరిష్మా కలిగిన పవన్ కళ్యాణ్ తో ముందుకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు.