Thursday, April 3, 2025
HomeDEVOTIONALసుప్ర‌భాత సేవ పునః ప్రారంభం

సుప్ర‌భాత సేవ పునః ప్రారంభం

ప్ర‌క‌టించిన టీటీడీ

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పవిత్రమైన ధనుర్మాసం నేటితో ముగుస్తుంది.

ఈనెల 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంద‌ని టీటీడీ వెల్ల‌డించింది. గత ఏడాది డిసెంబర్‌ 17న తెల్లవారు జామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింద‌ని టీటీడీ తెలిపింది.

భక్తులు ఈ విషయాన్ని గమనించాల‌ని కోరింది. అదే విధంగ ఈ నెల 16న ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం జరగనుంద‌ని వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ‌ల‌ను ద‌ర్శించు కునేందుకు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments