అయోధ్యలో సచిన్..తలైవా
అయోధ్య – ఇద్దరూ ఉద్దండులే. తమ తమ రంగాలలో పేరు పొందిన వారే. ఆ ఇద్దరి గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకరు సమున్నత క్రికెటర్ గా గుర్తింపు పొందారు. ముంబైకి చెందిన సచిన్ రమేష్ టెండూల్కర్. మరొకరు తమిళ సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్. ఈ ఇద్దరూ ఒకే చోట కొలువు తీరారు. ఆ అద్భుతమైన సన్నివేశానికి వేదికైంది ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరం స్థలం.
ఈ ఇద్దరికీ రామ జన్మ భూమి ట్రస్టు ప్రత్యేకంగా ఆహ్వానించింది. వీరితో పాటు సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన వారిని పిలిచింది. దాదాపు 7,000 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా కుంబ్లే, జడేజా కూడా పాల్గొన్నారు. రజనీకాంత్ పక్కనే టెండూల్కర్ కూర్చున్నారు. ఆ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ సందర్బంగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తన తండ్రి రజనీకాంత్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.