హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్: క్రీడా రంగం అభివృద్ధిలో స్పోర్ట్స్ జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఆయా ఆటల్లో క్రీడాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో క్రీడా పాత్రికేయులు కృషి ఎనలేనిదని అభిప్రాయపడ్డారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జాట్) 2025 డైరీని సీవీ ఆనంద్‌కు ఆయన కార్యాలయంలో సంఘం ప్రతినిధులు బహుకరించారు.
ఈ ఏడాదికి సంబంధించిన ముఖ్యమైన క్రీడలు, రాష్ట్ర క్రీడా సంఘాలతో కూడిన సమాచారంతో డైరీని రూపొందించిన ఎస్‌జాట్ బృందాన్ని సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులు, క్రీడా పాత్రికేయుల కోసం ఎస్‌జాట్ నిర్వహించబోయే కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌జాట్ అధ్యక్షుడు ఆర్.కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ దాస్, ఉపాధ్యక్షుడు ఎస్.ఎస్.బి సంజయ్, సంయుక్త కార్యదర్శి సీహెచ్.రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు జి.సునీల్ గౌడ్, ఎం.మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.