స్మితా సబర్వాల్ వైరల్
గణతంత్ర శుభాకాంక్షలు
హైదరాబాద్ – తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆమెను కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ పక్కన పెట్టింది. ఆమెకు అప్రధాన్యత పోస్టును కేటాయించింది. కేంద్ర సర్వీసులోకి వెళుతుందని అంతా భావించారు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.
కానీ అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది స్మితా సబర్వాల్. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, ఇక్కడే ఉంటానని స్పష్టం చేసింది. ఈ మేరకు తాను ఎవరికీ లొంగి పోయే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేసింది. ప్రజల కోసం పని చేయడం తన అభిమతమని, ఒకరి మెప్పు కోసమో లేదా ఇంకొకరి ప్రాపకం కోసం తాను ఏనాడూ ప్రయత్నం చేయబోనంటూ ఘాటుగా స్పందించింది.
తాజాగా శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా స్మితా సబర్వాల్ రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి పునాది రాజ్యాంగమేనని పేర్కొన్నారు. మన గణతంత్రం రాబోయే దశాబ్దాలలో ప్రతి పౌరునికి చైతన్య వంతమైన, సమ్మిళిత వృద్ధికి మార్గదర్శిగా ప్రకాశిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.