NATIONALNEWS

స్వామీజీల అయోధ్య బాట

Share it with your family & friends

22న శ్రీ‌రాముడి పునః ప్ర‌తిష్ట

క‌ర్ణాట‌క – ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని అయోధ్య రామ మందిరం దేదీప్యమానంగా వెలుగులు పంచుతోంది. ఎక్క‌డ చూసినా రామ భ‌క్తులు, స్వామీజీలు, మ‌ఠాధిప‌తుల‌తో క‌ళ క‌ళ లాడుతోంది. తాజాగా శ‌నివారం క‌ర్ణాట‌క‌కు చెందిన వివిధ మ‌ఠాల‌కు చెందిన మ‌ఠాధిప‌తులు, స్వామీజీలు అయోధ్య పుణ్య క్షేత్రానికి బ‌య‌లు దేరి వెళ్లారు. ఈ మ‌హోన్న‌త కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు త‌మ‌కు రామ మందిర ట్ర‌స్టు నుంచి ఆహ్వానం అందిందని తెలిపారు.

ఈ సంద‌ర్బంగా కేంద్ర స‌ర్కార్ ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. రామ మందిరాన్ని కోట్లాది రూపాయ‌ల‌తో నిర్మించారు. ఈనెల 22న దీనిని పునః ప్రారంభించేందుకు యూపీ , కేంద్ర స‌ర్కార్ ఏర్పాట్లు చేసింది. ల‌క్ష‌లాది మంది ఈ కార్య‌క్ర‌మానికి త‌ర‌లి రానున్నారు. ఇప్ప‌టికే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో శ్రీ‌వారికి సంబంధించిన ల‌క్ష ల‌డ్డూల ప్ర‌సాదాన్ని అయోధ్య‌కు త‌ర‌లించింది.

దేశ చ‌రిత్ర‌లో ఇది వినూత్న‌మైన ఘ‌ట్టం కాబోతోంద‌ని ఈ సంద‌ర్బంగా స్వామీజీలు పేర్కొన్నారు. ఈ అరుదైన కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేకంగా ఆహ్వానితులుగా ప్ర‌ముఖుల‌ను పిలిచింది ట్ర‌స్టు. ఇందులో సినీ రంగానికి, క్రీడా రంగానికి , వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన వారిని ఆహ్వానించింది. రాముడి పునః ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ప్ర‌ధాని మోదీ హాజ‌రు కానున్నారు.