దర్శకుడి ప్రతిభకు హ్యాట్సాఫ్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చకుంది. చాలా చోట్ల మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీని తీసేసి హనుమాన్ చిత్రాన్ని ఆడిస్తుండడం విశేషం.
ప్రత్యేకించి తనేమిటో, తన సత్తా ఏమిటో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అతడికి తగ్గట్టే హీరో కూడా అద్భుతంగా నటించాడు. గ్రాఫిక్స్ వీర లెవల్లో ఉండడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా హనుమాన్ గాలి వీస్తోంది. ఎక్కడ చూసినా హనుమాన్ చిత్రం గురించిన చర్చలు జరుగుతున్నాయి.
అయోధ్యలో ఈనెల 22న శ్రీరాముడి పునః ప్రతిష్ట కార్యక్రమం కొనసాగుతోంది. ఇదే క్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. తమ చిత్రానికి సంబంధించిన టికెట్ నుంచి రూ. 5 రూపాయల చొప్పున ఎంత వచ్చిన అయోధ్య ట్రస్టుకు ఇస్తామని తెలిపాడు.
ఇది సెన్సేషన్ అయ్యింది. ఇక చిత్ర యూనిట్ కూడా ఊహించని రీతిలో కలెక్షన్లు వస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లో రూ. 75 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు రూ. 21.35 కోట్లు రాగా 2వ రోజు రూ. 29.72 కోట్లు, మూడో రోజు రూ. 24.16 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ. 75.23 కోట్లు రాబట్టింది.