NEWSTELANGANA

10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్

Share it with your family & friends

ప్ర‌జా ప్ర‌తినిధులు కాదు జంప్ జిలానీలు

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స‌క్సెస్ అయ్యింది. కీల‌క‌మైన నేతలను ఆక‌ర్షించ‌డంతో పాటు భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి కోలుకోలేని షాక్ ఇస్తూ ఆ పార్టీ త‌ర‌పున తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు సైతం హ‌స్తం గూటికి చేరేందుకు క్యూ క‌ట్ట‌డం విస్తు పోయేలా చేస్తోంది.

గ‌తంలో కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాల‌ని ప్లాన్ చేశాడు. ఆయ‌న అందులో స‌క్సెస్ అయ్యాడు. పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. అంతే కాదు కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేందుకు త‌న పార్టీకి చెందిన వారిని కోవ‌ర్టులుగా పెట్టిన‌ట్లు కూడా విమ‌ర్శ‌లు ఉన్నాయి.

కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండ‌దు. ఊహించ‌ని రీతిలో జ‌నం ఛీ కొట్టారు. 39 సీట్ల‌కు ప‌రిమితం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో ఈ ప్ర‌భుత్వం 3 నెల‌లు కూడా ఉండ‌దంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. దీనిని సీరియ‌స్ గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి . ఆ మేర‌కు బీఆర్ఎస్ ను ఖాళీ చేయించే ప‌నిలో ప‌డ్డారు. ఇందులో స‌క్సెస్ అయ్యారు.

ఇప్ప‌టి దాకా బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 39 మంది లో ఇప్ప‌టి వ‌ర‌కు 10 మంది ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి తీసుకున్నారు. వారిలో స్టేష‌న్ ఘ‌న్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ , భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి, జ‌గిత్యాల్ ఎమ్మెల్యే ఎం. సంజ‌య్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద‌య్య‌, గ‌ద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి, రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్ , సేరి లింగంప‌ల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ప‌టాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి ఉన్నారు.