SPORTS

ఐపీఎల్ వేలంలో వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డ్

Share it with your family & friends

13 ఏళ్ల ఆట‌గాడిని తీసుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్

జెడ్డా – ఎవ‌రీ వైభ‌వ్ సూర్య‌వంశీ అనుకుంటున్నారా. జెడ్డా వేదిక‌గా జ‌రిగిన వేలం పాట‌లో హాట్ టాపిక్ గా మారాడు. యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా రికార్డ్ బ్రేక్ చేశాడు. ప‌ట్టుమ‌ని అత‌డికి 13 ఏళ్లు మాత్ర‌మే. ప్ర‌పంచ క్రికెట్ లో అత్యంత పిన్న వయ‌స్కుడు కావ‌డం విశేషం. త‌న‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యాజ‌మాన్యం ఏరికోరి ఎంచుకుంది. ప్ర‌ధానంగా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ అభిన‌వ్ పైనే ఫోక‌స్ పెట్టాడు.

ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో జ‌రిగిన అండ‌ర్ 19 మ్యాచ్ లో సెంచ‌రీ చేశాడు. త‌ను ఎడ‌మ చేతి వాటం బ్యాట‌ర్.
త‌న‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కోటి 10 ల‌క్షల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది . ప్ర‌తిభ‌ను గుర్తించ‌డం, వారిని ప్రోత్స‌హించ‌డంలో అన్ని ఫ్రాంచైజీల కంటే ముందుంటోంది రాజ‌స్థాన్.

త‌ను రూ. 30 ల‌క్ష‌ల బేస్ ధ‌ర‌తో వేలం పాట‌లోకి వ‌చ్చాడు. త‌న‌ను తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కూడా ప్ర‌య‌త్నం చేసింది. కానీ రాజ‌స్థాన్ తీసుకుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విష‌యానికి వ‌స్తే ర‌వీంద్ర జ‌డేజా 19 ఏళ్ల వ‌య‌సులో షేన్ వార్న్ సార‌థ్యంలో జ‌ట్టులోకి వ‌చ్చాడు.

2013లో 18 ఏళ్ల వయసులో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో సంజూ శాంసన్ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. సంజూ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు.

బీహార్‌కు చెందిన బ్యాటర్ గత నెలలో చెన్నైలో జ‌రిగిన మ్యాచ్ లో కేవ‌లం 62 బంతుల్లో 104 పరుగులు చేయడంతో క్రికెట్ సర్కిల్‌లలో అలలు సృష్టించాడు.

ఆ దెబ్బతో, బంగ్లాదేశ్‌కు చెందిన నజ్ముల్ హొస్సేన్ శాంటో పేరిట ఉన్న 14 సంవత్సరాల 241 రోజుల రికార్డును 13 సంవత్సరాల 188 రోజులలో యూత్ క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా సూర్యవంశీ నిలిచాడు.