132 మందికి పద్మ పురస్కారాలు
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ – 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన పౌర పురస్కారాలను ప్రకటించింది. 5 మందికి పద్మ విభూషణ్ , 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులతో కూడిన జాబితాను వెల్లడించింది.
పద్మ విభూషణ్ పురస్కారం దేశంలోనే భారత రత్న తర్వాత రెండో అత్యున్నత అవార్డు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు దక్కింది. దిగ్గజ నటి వైజయంతిమాల బాలి కూడా ఉన్నారు. సులభ్ ఫౌండేషన్ ఫౌండర్ , చైర్మన్ బిందేశ్వర్ పాఠక్ , పద్మా సుబ్రమణ్యంకు కూడా వరించింది. ఈ ఇద్దరూ ఇప్పుడు లేరు.
పద్మ భూషణ్ పురస్కారాలలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎం. ఫాతిమా బీవీ (మరణాంతరం) , నటుడు మిథున్ , ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియు, కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్, గాయని ఉషా ఉతుప్ , డీఎండీకే చీఫ్ , దివంగత నటుడు విజయకాంత్ ను ఎంపిక చేసింది కేంద్రం.
భారత రత్నకు సంబంధించి బీహార్ కు చెందిన జన్ నాయక్ కర్పూరీ ఠాకూర్ ను ఇప్పటికే ప్రకటించింది. పద్మ అవార్డులు పొందిన వారిలో..ఎన్ కామా, సీతారాం జిందాల్ , అశ్విన్ బాల చంద్ మెహతా, సత్య బ్రత ముఖర్జీ, తేజస్ మధుసూదన్ పటేల్ , ఓలంచెరి రాజగోపాల్ , దత్తాత్రే అంబదాస్ , తోగ్జాన్ రింపోచే, ప్యారేలాల్ శర్మ, చందేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ , కుందన్ వ్యాస్ ఉన్నారు.
ఇక పద్మశ్రీ అవార్డులు పొందిన వారిలో ఉదయ్ వి. దేశ్ పాండే, డాక్టర్ మనోహర్ డోల్ , జహీర్ ఐ కాజీ , డాక్టర్ చంద్రశేఖర్ , కల్పనా మెర్పారియా, శంకర్ బాబా, కృష్ణ లీలా, గోపీనాథ్ స్వైన్ , భగవత్ పదాన్ , బినోద్ మహారాణా, బినోద్ కుమార్ పసాయత్ ఉన్నారు. రోహన్ బోపన్న, జోష్నా చిన్నప్ప కూడా ఎంపికయ్యారు. మహోత్ పర్బతి బారువా, చామీ ముర్ము, సంగంకిమా , ప్రేమ్ ధన్ రాజ్ పద్మశ్రీ అవార్డులు పొందారు.