ప్రకటించిన ఎంపీ కేశినేని శివ నాథ్
విజయవాడ – బెజవాడ ఎంపీ కేశినాని చిన్ని సంచలన ప్రకటన చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ రాబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అమరావతి స్పోర్ట్స్ యూనివర్శిటీ కోసం 142 ఎకరాల కేటాయింపు చేశారని, స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కాబోతుందని తెలిపారు. విజయవాడ లోని సిద్ధార్థ నగర్ లో ది పికిల్ బాల్ రిపబ్లిక్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన పికిల్ బాల్ కోర్ట్ లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో స్పోర్ట్స్ అకాడమీలు రావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో హైదరాబాద్ లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏషియన్ గేమ్స్ ను అద్భుతంగా నిర్వహించడం జరిగిందన్నారు.
వీటి నిర్వహణ వల్ల మౌలిక సదుపాయాలు కల్పించటం జరిగిందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. అందువల్ల ఎన్నో స్పోర్ట్స్ అకాడమీ వచ్చాయని చెప్పారు..పుల్లెల గోపిచంద్ అకాడమీ కూడా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో వచ్చిందన్నారు. ఈ అకాడమీలు రావటం వల్ల హైదరాబాద్ లో ఔత్సాహిక క్రీడాకారులు వారి నైపుణ్యాన్ని మెరుగు పర్చుకుని రాణించారని పేర్కొన్నారు.
అదే విధంగా రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాబోయే కాలంలో అమరావతి లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ సిటీలో ఇలాంటి అకాడమీలు అందులో చోటు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్రీడాలకు సంబంధించిన అకాడమీలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు. స్పోర్ట్స్ యూనివర్శిటీ అంటే క్రీడాకారుల నైపుణ్యాన్ని మెరుగు పర్చటమే కాదు…స్పోర్ట్స్ కి సంబందించిన సపోర్టింగ్ స్టాప్, ఫిజియో ధెరఫిస్టులు, కోచ్ లకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా వుండ బోతుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ది తోపాటు క్రీడాభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారన్నారు. ఆర్యోగానికి క్రీడలకు చాలా అవసరమని, నేటి యువతకి క్రీడలపట్ల బాగా ఆసక్తి పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పికిల్ బాల్ కోర్ట్ నిర్వహకులు డాక్టర్ వడ్లమూడి స్రవంతి, ప్రియ, ప్రశాంతి, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాహ్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.