16న బాబు స్కిల్ కేసుపై తీర్పు
వెలువరించనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ – తాను ఎలాంటి పాపం చేయలేదని, అకారణంగా తనను ఇరికించే ప్రయత్నం చేశారని, కక్ష సాధింపు ధోరణితో రాజమండ్రి జైలు పాలు చేశారంటూ ఆవదేన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు.
హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పు ఈనెల 16న వెలువరించ నున్నట్లు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఏపీలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నానా దందాలు చేశాడని, అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఏపీ సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ బాబు, నారాయణ, తదితరులపై కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఢిల్లీ నుంచి న్యాయవాదులు వచ్చినా వారి వాదనలు పని చేయలేదు. జడ్జి కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా చట్టం ముందు అంతా సమానమేనని రిమాండ్ విధించింది. దీంతో దెబ్బకు చంద్రబాబు జైలు ఊచలు లెక్క బెట్టక తప్పలేదు. తాజాగా సుప్రీంకోర్టులో ఏపీ స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ఎలాంటి తుది తీర్పు రానుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.