ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల – టీటీడీ భక్త బాంధవులకు తీపి కబురు చెప్పింది. వచ్చే ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇవాళ కీలక ప్రకటన చేసింది.
జనవరి 18న ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కసోం నమోదు చేసుకోవాలని భక్తులను కోరింది టీటీడీ.
లక్కీ డిప్ లో ఎవరికి వచ్చానే దాని గురించి 20న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారని తెలిపింది. డిప్ లో ఎంపికైన వారు జనవరి మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలని, టికెట్ ని ఖరారు చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఇక 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార ఆర్జిత సేవలను విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. మధ్యాహ్నం 3 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార వర్చువల్ సేవా+ కనెక్టెడ్ దర్శనం టికెట్లను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టికెట్లను, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ మొదటి గడప బ్రేక్ దర్శనం టికెట్లను రిలీజ్ చేస్తామని టీటీడీ ఈవో వెల్లడించారు. ఇదే రోజు 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల దర్శనం టికెట్లను విడుదల చేస్తామని పేర్కొంది. 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలో గదుల కోటాను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది టీటీడీ.