NEWSTELANGANA

నాగార్జున‌సాగ‌ర్ కు పెరిగిన వ‌ర‌ద

Share it with your family & friends

2 క్ర‌స్ట్ గేట్ల ద్వారా నీరు విడుద‌ల

న‌ల్ల‌గొండ జిల్లా – ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి జ‌లాశ‌యాలు నిండు కుండ‌ల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి. ఓ వైపు క‌ర్నూల్ జిల్లాలోని శ్రీ‌శైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి పోయింది. అలుగు పారుతోంది. మ‌రో వైపు తెలంగాణ రాష్ట్రంలోని న‌ల్ల‌గొండ జిల్లాలో పేరు పొందిన నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద ఉధృతి పెరిగింది.

దీంతో నీటి పారుద‌ల శాఖ అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం 2 క్ర‌స్ట్ గేట్ల‌ను ఎత్తి వేశారు. దిగువ‌కు నీటిని వ‌దిలారు. ఇదిలా ఉండ‌గా నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు పూర్తి నీటి మ‌ట్టం 590 అడుగులు . కాగా ప్ర‌స్త‌తం నీటి మ‌ట్టం 590 అడుగుల‌కు చేరుకుంది.

ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామ‌ర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్ర‌స్తుత నీటి నిల్వ సామ‌ర్థ్యం 312 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 65,457 క్యూసెక్కులు గా ఉంద‌ని నాగార్జున సాగ‌ర్ డ్యాం నీటి పారుద‌ల అధికారులు వెల్ల‌డించారు.