NEWSTELANGANA

200 సంస్థ‌లు రూ. 40,232 కోట్లు

Share it with your family & friends

దావోస్ సీఎం టూర్ బిగ్ స‌క్సెస్

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. దావోస్ లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు జ‌రిగిన టూర్ దిగ్విజ‌యంగా ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని బృందం 200 సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపింది. ఈ సంస్థ‌ల ద్వారా రూ.40,232 కోట్ల పెట్టుబ‌డులు రాష్ట్రానికి వ‌చ్చాయి. ఇది రాష్ట్ర చ‌రిత్ర‌లో ఓ రికార్డ్ గా చెప్ప‌వ‌చ్చు. ఇంత పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్ మెంట్స్ రావ‌డం విశేషం.

ఇక సంస్థ‌ల ప‌రంగా చూస్తే ప్ర‌పంచం వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీలు ఉన్నాయి. వాటిలో అదానీ గ్రూప్, జేఎస్ డ‌బ్ల్యూ, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, బీఎస్ ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ , త‌దిత‌ర కంపెనీలు తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి.

చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు.
హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలన్నారు.

ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు అమెరికా, యూరప్ దేశాలు పని చేస్తున్నాయని అన్నారు. హెల్త్ కేర్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు, అధునాతన వైద్య సేవలను ప్రతి మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరుకోడానికి డిజిటల్, సాంకేతికను ఉపయోగించాలని సీఎం
సూచించారు.