ఇంజనీరింగ్ ఆవిష్కరణలలో టాప్
హైదరాబాద్ : అద్భుతాలు ఆకాశం నుంచి ఊడి పడవు. అవి నేల మీదనే రూపు దిద్దుకుంటాయి. భిన్నమైన ఆలోచనలే కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. అలాంటి కలను కనడమే కాదు ఆచరణలో అద్భుతంగా చేసి చూపించాడు తెలంగాణ మట్టి బిడ్డ. తను ఎవరో కాదు పరశురామ్ పాక. తన స్వస్థలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు, ప్రశంసలు కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఆయన ఎక్కడ కొత్త ఆవిష్కరణలు ఉన్నా సరే వాటిని గుర్తిస్తారు. దానిని తయారు చేసిన వారిని ప్రోత్సహిస్తారు. అభినందిస్తారు. తాజాగా పరశురామ్ పాక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
నేను పరశురామ్ పాక స్థిరమైన చలనశీలత, ఇంజనీరింగ్ ఆవిష్కరణల రంగంలో మార్గదర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. తన ప్రయాణం భారతదేశంలోని వ్యవసాయ ప్రకృతి దృశ్యాల మధ్య ప్రారంభమైంది. అక్కడ తాను పంటలను మాత్రమే కాకుండా స్థిరత్వం పట్ల మక్కువను కూడా పండించానని ఓ సందర్బంలో పేర్కొన్నాడు పరశురామ్ పాక. తాను మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీజీ చేశాడు. ఏదో ఒక రోజు తను కూడా వేలాది మందికి ఉపాధి కల్పించాలని అనుకున్నాడు. తనలో మెదిలిన ఆలోచన, కలకు ప్రాణం పోసేందుకు అమరికాకు వెళ్లేలా చేశాయి. అక్కడ గణనీయమైన పరిశోధనలు చేశాడు.
గత ఐదు సంవత్సరాలుగా తను ఎలక్ట్రిక్ చలనశీలత, పునరుత్పాదక ఇంధన రంగాలలో రెండు వినూత్నమైన, ప్రభావవంతమైన స్టార్టప్‌లకు నాయకత్వం వహించాడు. ఇందులో భాగంగా తను గ్రావ్టన్ మోటార్స్‌ను స్థాపించాడు. దీంతో పాటు సీబెక్ యుటిలిటీస్‌కు కూడా నాయకత్వం వహించాడు. వ్యవస్థాపకత, సాంకేతికత ద్వారా సానుకూల మార్పును తీసుకు రావచ్చని ఆచరణలో చేసి చూపించాడు పరశురామ్ పాక.
గ్రావ్టన్ క్వాంటాతో రికార్డు సృష్టించడం . ఇది హైదరాబాద్ నుండి కన్యాకుమారికి 24 గంటల్లోపు నాన్-స్టాప్ డ్రైవ్‌ను పూర్తి చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గా ,ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందింది. ఈ అద్భుతమైన ఫీట్ తమ ఉత్పత్తుల విశ్వసనీయత, సామర్థ్యాన్ని ప్రదర్శించేలా చేసింది, స్థిరమైన చలనశీలతలో అగ్రగామిగా గ్రావ్టన్ మోటార్స్ తన స్థానాన్ని నిలుపుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీ కెన్యా, ఫిలిప్పీన్స్, పెరూ వంటి దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. తను సాధించిన ఈ విజయం లక్షలాది యువతకు ప్రేరణగా , స్పూర్తిగా నిలుస్తుందని ఆశిద్దాం.






