భర్తను కోల్పోయిన ఏ మహిళ దుఖాన్న ఎవరు ఆపలేరు
హైదరాబాద్ : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. తమ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గురించి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ గౌడ్ లు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. వారికి కూడా అక్కా చెల్లెళ్లు, భార్యలు ఉన్నారన్న సంగతి మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. దీనిని ఎవరూ హర్షించరని, తమ నోటి దూలను తగ్గించు కోవాలని హితవు పలికారు. ప్రజలు దేనినైనా భరిస్తారు కానీ ఇలాంటి చవకబారు విమర్శలు, వ్యక్తిగతంగా దూషణలను తట్టుకోలేరని పేర్కొన్నారు. ప్రత్యేకించి మహిళలను కావాలని కించ పరిచేలా చేస్తే తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు సబితా ఇంద్రారెడ్డి.
భర్త చని పోయిన మహిళల పరిస్థితి దయనీయంగా ఉంటుందన్నారు. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారికి అంతగా గుర్తింపు ఉండదన్నారు. ఇదే విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తమ నాయకురాలు సోనియా గాంధీని అడిగితే చెబుతుందన్నారు. ఆపుకోలేని దుఖాన్ని కూడా విమర్శిస్తున్న కాంగ్రెస్ మంత్రుల తీరు తీవ్ర అక్షేపనీయం అన్నారు.యావత్ మహిళ లోకం మిమ్మల్ని క్షమించదని పేర్కొన్నారు. మీ మాటలు ఒక సునీతమ్మకే కాదు, మీ అగ్రనేత సోనియమ్మ లాంటి వాళ్ళను కూడా మీరు విమర్శించినట్లు అని గుర్తు పెట్టుకోవాలన్నారు. భర్తలను కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో నమ్ముకున్న ప్రజల కోసం, దివంగత నేతల ఆశయాల సాధనల కోసం ప్రజా జీవితంలోకి వచ్చిన మాలాంటి వారికి ఇలాంటి వ్యాఖ్యలు ఎంతగానో బాధకు గురి చేశాయన్నారు సబితా ఇంద్రారెడ్డి.






