ఏడిస్తే కూడా రాజ‌కీయం చేస్తారా : స‌బితా ఇంద్రారెడ్డి

Spread the love

భర్తను కోల్పోయిన ఏ మహిళ దుఖాన్న ఎవరు ఆపలేరు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సీరియ‌స్ అయ్యారు. త‌మ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ అభ్య‌ర్థి మాగంటి సునీత గురించి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ లు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వారికి కూడా అక్కా చెల్లెళ్లు, భార్య‌లు ఉన్నార‌న్న సంగ‌తి మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. దీనిని ఎవ‌రూ హ‌ర్షించ‌ర‌ని, త‌మ నోటి దూల‌ను తగ్గించు కోవాల‌ని హిత‌వు ప‌లికారు. ప్ర‌జ‌లు దేనినైనా భ‌రిస్తారు కానీ ఇలాంటి చ‌వ‌క‌బారు విమ‌ర్శ‌లు, వ్య‌క్తిగ‌తంగా దూష‌ణ‌ల‌ను త‌ట్టుకోలేర‌ని పేర్కొన్నారు. ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల‌ను కావాల‌ని కించ ప‌రిచేలా చేస్తే త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు స‌బితా ఇంద్రారెడ్డి.

భ‌ర్త చ‌ని పోయిన మ‌హిళ‌ల ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంటుంద‌న్నారు. ఏ స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ వారికి అంత‌గా గుర్తింపు ఉండ‌ద‌న్నారు. ఇదే విష‌యం గురించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు త‌మ నాయ‌కురాలు సోనియా గాంధీని అడిగితే చెబుతుంద‌న్నారు. ఆపుకోలేని దుఖాన్ని కూడా విమర్శిస్తున్న కాంగ్రెస్ మంత్రుల తీరు తీవ్ర అక్షేపనీయం అన్నారు.యావత్ మహిళ లోకం మిమ్మల్ని క్షమించద‌ని పేర్కొన్నారు. మీ మాటలు ఒక సునీతమ్మకే కాదు, మీ అగ్రనేత సోనియమ్మ లాంటి వాళ్ళను కూడా మీరు విమర్శించినట్లు అని గుర్తు పెట్టుకోవాల‌న్నారు. భర్తలను కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో నమ్ముకున్న ప్రజల కోసం, దివంగత నేతల ఆశయాల సాధనల కోసం ప్రజా జీవితంలోకి వచ్చిన మాలాంటి వారికి ఇలాంటి వ్యాఖ్యలు ఎంతగానో బాధ‌కు గురి చేశాయ‌న్నారు స‌బితా ఇంద్రారెడ్డి.

  • Related Posts

    అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

    Spread the love

    Spread the loveవ‌ర్షాలు స‌మృద్దిగా పడాల‌ని కోరుకుంటున్నా అమ‌రావ‌తి : భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. ఏటా జేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులంతా ఆనందోత్సాహాల మధ్య నేల తల్లికి…

    లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం

    Spread the love

    Spread the loveరావాల‌ని కోరిన అధ‌వ అర్జున‌, తిరుమాళ‌వ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత తొలిసారిగా మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. జూలై 1న త‌న నేతృత్వంలో జ‌రిగే ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *