Wednesday, 18 November 2026
Trending

సైబర్ మోసానికి గురైన నటి అనిత

newsseals-actressAnita

హైద‌రాబాద్ : మహాక‌వి శ్రీ‌శ్రీ చెప్పిన‌ట్టు కాదేదీ క‌విత‌కు అన‌ర్హం అన్న‌ట్టు ప్ర‌తి ఒక్క‌రు సైబ‌ర్ వ‌ల‌లో చిక్కుకుంటున్నారు. బ‌య‌ట‌కు చెప్పుకోలేక కొంద‌రు లోలోప‌ట దిగ‌మింగుతున్నారు. మ‌రికొంద‌రు బ‌య‌ట ప‌డుతున్నారు. తాజాగా సైబ‌ర్ వ‌ల‌లో చిక్కుకుంది తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ‌ర్ద‌మాన న‌టి అనిత‌. త‌ను విమాన టికెట్ విషయంలో సైబర్ మోసానికి గురైంది. బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేస్తామని నమ్మించారు సైబ‌ర్ కేటుగాళ్లు. రూ. 4.14 లక్షలు కాజేశారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివస్తోంది నటి గోగినేని అనిత. అమెరికాలోని వాషింగ్టన్‌లో జరగనున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకల కోసం విమాన టికెట్ బుక్ చేయడానికి ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెంట్ కోసం వెతికారు

‘లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్’ (Low Fly Tours and Travels) సంస్థకు చెందిన రాజేష్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ. 4,14,180 అవుతుందని చెప్పి న‌మ్మించాడు. ఆమె డెబిట్ కార్డ్ వివరాలను అడిగాడు. టికెట్ బుకింగ్ కోసమేనని నమ్మిన అనిత, తన డెబిట్ కార్డ్ వివరాలను ఇవ్వడమే కాకుండా, ఓటీపీ (OTP)ని కూడా షేర్ చేశారు. దీంతో స‌ద‌రు న‌టి ఖాతా నుండి ‘క్లియర్ ట్రిప్’ (Clear Trip) పేరుతో డబ్బు కట్ అయినప్పటికీ, టికెట్ బుకింగ్‌కు సంబంధించిన ఎటువంటి వివరాలు అందక పోవడంతో తాను మోస పోయానని గ్రహించింది న‌టి అనిత‌. చివ‌ర‌కు ల‌బోదిబోమంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *