Monday, 16 November 2026
Trending

సానియా మీర్జాకు పరిణీతి చోప్రా బ‌ర్త్ డే విసెస్

newsseals-ParineetiChopra

ముంబై: నటి పరిణీతి చోప్రా తన సన్నిహిత స్నేహితురాలు మాజీ టెన్నిస్ స్టార్ అయిన సానియా మీర్జాకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. సానియా తనకు ఎందుకు అంత ప్రత్యేకమో ఆమె వెల్లడించింది. ‘ఇషాక్‌జాదే’ నటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మధురమైన సందేశాన్ని పంచుకుంట సానియా నిజాయితీగా , సాధారణంగా ఉండటం తనకు ఇష్టమని, ఒక వ్యక్తిలో తనకు ఇష్టమైన రెండు లక్షణాలు అవేనని పేర్కొంది. “నేను నిన్ను ఎందుకంత ప్రేమిస్తున్నాను? ఎందుకంటే నువ్వు నిజాయితీగా ఉంటావు. ఎందుకంటే నువ్వు సాధారణంగా ఉంటావు. ఒక మనిషిలో నాకు ఇష్టమైన రెండు లక్షణాలు అవే. హ్యాపీ హ్యాపీ బర్త్‌డే మై అగ్గూ. ఐ లవ్ యూ,” అని ఆమె రాసింది.

పరిణీతి, సానియాతో గడిపిన కొన్ని సంతోషకరమైన క్షణాలకు సంబంధించిన చిత్రాల సిరీస్‌తో పాటు ఒక వీడియోను కూడా పంచుకున్నారు. ఈ ఫోటోలు వారి మధ్య ఉన్న సన్నిహిత బంధాన్ని, సరదా స్నేహాన్ని తెలియ జేస్తున్నాయి. మొదటి చిత్రంలో ఇద్దరూ పుట్టినరోజు కేక్‌తో కలిసి ఫోటోకు ఫోజులిస్తూ నవ్వుతూ కనిపించారు. ఆ తర్వాతి చిత్రాలలో పరిణీతి, సానియా తమ స్నేహితులతో కలిసి గ్రూప్ ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఇది వారి కలయికలలోని ఆత్మీయతను, స్నేహ భావాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ సిరీస్‌లోని ఒక వీడియోలో ఇద్దరూ ఆనందంగా గడుపుతుండగా, చివరి ఫోటోలో కెమెరాకు ఫోజులిస్తూ పరిణీతి ఆప్యాయంగా సానియా మెడ చుట్టూ చేతులు వేసి ఉన్నారు.

పరిణీతి, సానియా చాలా సంవత్సరాలుగా సన్నిహిత స్నేహాన్ని పంచుకుంటున్నారు. వీరిద్దరూ తరచుగా సోషల్ మీడియా పోస్టులు, సరదా సంభాషణల ద్వారా తమ బంధాన్ని పంచుకుంటూ ఉంటారు. తన బయోపిక్‌లో తన పాత్రను పోషించాలని కోరుకుంటున్న నటీమణులలో దీపికా పడుకోన్‌తో పాటు పరిణీతి పేరును కూడా సానియా పేర్కొన్న తర్వాత వారి స్నేహం మొదలైందని సమాచారం. ఆ పాత్రను చేపట్టడానికి పరిణీతికి “సాపేక్షంగా స్వేచ్ఛ” ఉందని సానియా సరదాగా వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్య చివరికి వారిద్దరి మధ్య పరిచయానికి, తద్వారా బలమైన స్నేహానికి దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *