Monday, 16 November 2026
Trending

గ్రామీణ నేప‌థ్యంలో కొణిద‌ల ప‌వ‌న్ తేజ్ మూవీ

newssealss-KonidelaPawanTeja

హైద‌రాబాద్ : కొణిదెల పవన్ తేజ్ నటించనున్న గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రం జ‌న‌తా ప్రారంభమైంది. రాజశేఖర్ యాదవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గ్రామీణ ప్రేమకథ , యాక్షన్ అంశాలతో కూడిన ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తిగా అమలాపురంలోనే జరగనుంది. పడాని కుమార్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి, ఇటీవల టైటిల్ ప్రకటన , ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వసుంధర ఆర్ట్స్ బ్యానర్‌పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం గత రెండేళ్లుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కథపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఇతర సినిమాల నుంచి అవకాశాలు వచ్చినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ కోసం తాను వేచి చూశానని పవన్ తేజ్ తెలిపారు.

ఇది భావోద్వేగాలతో కూడిన కథ అని ఇందులో మాస్ ప్రేక్షకులను అలరించే అంశాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రామనాబాబు , అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానికంగా చిత్రీకరణ జరపడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, అమలాపురంలో రెండు నెలల పాటు షూటింగ్ జరగనుందని తెలిపారు. అలాగే ఫైట్ మాస్టర్ గౌరీ శంకర్ వి.వి. మాట్లాడుతూ ఈ చిత్రంలో ప్రత్యేకమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *