Wednesday, 18 November 2026
Trending

రోబోటిక్స్ త‌యారీలో బెంగ‌ళూరు టాప్

newsseals-DKShivaKumar

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున బెంగ‌ళూరులో టెక్ స‌మ్మిట్ ను నిర్వ‌హిస్తోంది. ఈ స‌మ్మిట్ కు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి దిగ్గ‌జాలు హాజ‌ర‌య్యారు. ఈ టెక్ స‌మ్మిట్ ను సీఎం డీకే శివ‌కుమార్ ప్రారంభించి ప్ర‌సంగించారు. ఆవిష్క‌ర‌ణ‌ల‌కు, పెట్టుబ‌డుల‌కు బెంగ‌ళూరు స్వ‌ర్గధామం అని పేర్కొన్నారు. ఐటీ అంటేనే బెంగ‌ళూరు గుర్తుకు వ‌స్తుంద‌న్నారు సీఎం. ఇదిలా ఉండ‌గా తాజాగా టెక్ స‌మ్మిట్ లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి రోబోలు. మొట్ట మొదటిసారిగా జరిగిన రోబోట్‌డాగ్ రేసులో స్వదేశీ చతుష్పాద రోబోట్లు ట్రాక్‌పైకి రావడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు సీఎం. భారతదేశపు రోబోటిక్స్ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఉత్తేజకరమైన దృశ్యాన్ని చూసే అవకాశం నాకు లభించిందన్నారు డీకే శివ‌కుమార్.

వీటిని బెంగళూరుకు చెందిన జ‌న‌ర‌ల్ అటాన‌మీ అభివృద్ది చేయ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. అభివృద్ధి చేసిన PARAM సెకనుకు 4.3 మీటర్ల అద్భుతమైన వేగాన్ని నమోదు చేసి విజేతగా నిలవడం చూడటానికి చాలా ఆనందంగా ఉందన్నారు. రేసులోని ఉత్సాహాన్ని మించి, మన యువ ఆవిష్కర్తల చాతుర్యం ఫిజికల్ ఏఐ (AI) , అటానమస్ సిస్టమ్స్‌లో భారతీయ కంపెనీల పెరుగుతున్న సామర్థ్యాలు ప్రత్యేకంగా నిలిచాయని తెలిపారు. ఫరీద్ అహ్సాన్, భాను ప్రతాప్ సింగ్, సూరజ్ హంచినాల్ , జనరల్ అటానమీ బృందానికి నా అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు డీకే శివ‌కుమార్. రోబోటిక్స్ , అటానమస్ టెక్నాలజీ సరిహద్దులను విస్తరిస్తూ ముందుకు సాగుతున్న ఈ ఆవిష్కర్తలందరికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *