Saturday, 14 November 2026

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు త‌మిళ‌నాడు కేరాఫ్

newsseals-SKeerthana

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చే వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌ని చెప్పారు. త‌మ‌ది ఫ్రెండ్లీ స‌ర్కార్ అని పేర్కొన్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లంద‌రికీ మేలు చేకూర్చేలా సంక్షేమ ప‌థ‌కాల‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇదే క్ర‌మంలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు వ‌ల్ల వేలాది మందికి ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా ఉపాధి క‌లుగుతుంద‌ని తెలిపారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా భారీ ఎత్తున త‌మిళ‌నాడు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయ‌న్నారు. ఆ దిశ‌గా త‌మ స‌ర్కార్ కూడా కీల‌క ప్రోత్సాహ‌కాలు అందించేందుకు సిద్దంగా ఉంద‌న్నారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

తమిళనాడు GCC వృద్ధి కథకు, వ్యాపారాలు , ప్రతిభ వర్ధిల్లడానికి సరైన మౌలిక సదుపాయాలు, సమీకృత పట్టణాభివృద్ధి, బలమైన పర్యావరణ వ్యవస్థ అవసరం అని అభిప్రాయ‌ప‌డ్డారు. తిరు జోసెఫ్ విజ‌య‌య్ చంద్ర‌శేఖ‌ర్ సార‌థ్యంలో, నాయ‌క‌త్వంలో హోసూర్ వంటి అభివృద్ధి చెందుతున్న కేంద్రాలలో అవకాశాలను విస్తరిస్తూనే చెన్నై అంతటా ప్రపంచ స్థాయి గ్లోబ‌ల్ కేపబిలిటీ కారిడార్లను నిర్మించడంపై తాము దృష్టి సారిస్తున్నామ‌ని అన్నారు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి ఎస్. కీర్త‌న‌. నిర్మాణాత్మక చర్చ కోసం మాతో చేరిన డెవలపర్లు , పరిశ్రమల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చి తమిళనాడును గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు మరింత బలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని తాము ఆశిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *