చెన్నై : బీజేపీ సీనియర్ , వివాదాస్పద నాయకుడు సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సర్కార్ పై. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. ఈ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న తీవ్రమైన ఆందోళనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. చట్టబద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన వస్తోందా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం చచ్చి పోయినట్టేనా? అని ఆందోళన వ్యక్తం చేశారు.
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాదని పేర్కొన్నారు. వాటిని రాజకీయ అధికారం కోసం బలిపెట్టలేం అన్నారు. ఎన్నికల పవిత్రతను కాపాడేందుకు కఠినమైన, అమలు చేయదగిన మార్గదర్శకాలను కోరుతూ తాను కోర్టును ఆశ్రయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు సుబ్రమణ్య స్వామి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన స్థానంలో ఆటవిక రాజ్యం నడుస్తోందా అంటూ ప్రశ్నించారు.
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నికల స్వేచ్ఛను, ప్రజాస్వామ్య విలువలను బలిపీఠం ఎక్కించ కూడదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమగ్రతను, పారదర్శకతను కాపాడేందుకు కఠినమైన, అమలు చేయదగిన మార్గదర్శకాలు అవసరమని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు.




