హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ నటించిన ‘దాదా’ చిత్రం నుండి ‘దాదా ధమాకా’ లిరికల్ వీడియో విడుదలైంది. డిసెంబర్లో ‘దాదా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ఈ సినిమాలోని మొదటి పాట ‘దాదా ధమాకా…’ను విడుదల చేసింది. ఈ పాటలో బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా, చక్కని నృత్య భంగిమలతో అలరించారు, ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రి కూడా ఈ లిరికల్ వీడియోలో ఆకర్షణీయంగా కనిపించి, పాటను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ పాట గురించి సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ మొత్తాన్ని దాదా ధమాకా తో డ్యాన్స్ చేయిద్దాం. మీ రీల్స్‌ను రూపొందించి, అద్భుతమైన స్టెప్పులతో ఈ ‘దాదా ధమాకా’ వేడుకలో భాగస్వాములు అవ్వండి అని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ పాట కోసం బాలకృష్ణ స్వయంగా గాత్రదానం చేసి అభిమానులను, నెటిజన్లను ఆశ్చర్య పరిచారు.
పూర్తిస్థాయి డ్యాన్స్ నంబర్‌గా రూపొందిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అంతకు ముందు విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో బాలకృష్ణ ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌గా, పవర్ఫుల్ ‘దాదా’ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన శైలి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బాలయ్య తీవ్రమైన గ్యాంగ్‌స్టర్ లుక్ , అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఆయన అభిమానులను ఎంతగానో అలరించాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, ‘వృద్ధి సినిమాస్’ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాకు ఎస్.ఎస్. థమన్ శక్తివంతమైన సంగీతాన్ని అందించనున్నారు. ఇందులో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, శరత్ కుమార్, అభిమన్యు సింగ్, ఉపేంద్ర లిమాయే, మనీష్ వాధ్వా , స్వసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.




