చెన్నై : చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో రాప్టీ ఎనర్జీ మొట్టమొదటి మెగా ఎక్స్‌పీరియెన్షియల్ సెంటర్ ను ప్రారంభించారు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈ ప్రారంభోత్సవానికి కంపెనీ యొక్క 100వ మోటార్‌సైకిల్‌ను లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్యమంత్రితో కలిసి సచివాలయంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన. తమిళనాడుకు చెందిన నలుగురు ఇంజనీర్లచే స్థాపించబడిన రాప్టీ స్వదేశీ ఎలక్ట్రిక్ మొబిలిటీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. దీని T30 భారతదేశపు మొట్టమొదటి హై-వోల్టేజ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కావడం విశేషం.
టిడ్కో (TIDCO) యొక్క వ్యూహాత్మక పెట్టుబడితో రాప్టీ తమిళనాడు స్వదేశీ డీప్-టెక్ ఎకోసిస్టమ్ పెరుగుతున్న ఆశయానికి ప్రతీకగా నిలుస్తోందని ప్రశంసలు కురిపించారు ఈ సందర్బంగా మంత్రి . కీలకమైన సాంకేతికతలను అభివృద్ధి చేయడం నుండి తమిళనాడులో తయారీ సామర్థ్యాలను నిర్మించడం వరకు, ఇటువంటి ఆవిష్కరణల ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు . రాప్టీ బృందం తమ ప్రయాణాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నందున,వారికి నిరంతర విజయాలు కలగాలని ఆకాంక్షిస్తున్నామని ఈ సందర్బంగా పేర్కొన్నారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.




