Wednesday, 11 November 2026

కొత్త పార్టీ పేరు ప్ర‌క‌టించిన విజయ సాయిరెడ్డి

newsseals-VijaySaireddy

విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా కొత్త పార్టీ పేరును ప్ర‌క‌టించారు. ప‌రివ‌ర్త‌న రాజ‌నీతి పార్టీ అని పెడుతున్న‌ట్లు వెల్ల‌డించారు. పార్టీ జెండాకు సంబంధించి తెలుగు, ఆరెంజ్ రంగుల‌తో ఉంటుంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా గ‌తంలో ఏలిన వైఎస్ఆర్సీపీ ని, ప్ర‌స్తుతం పాల‌న సాగిస్తున్న ఏపీ కూట‌మి స‌ర్కార్ ను ఏకి పారేశారు. అటు జ‌గ‌న్ రెడ్డిని ఇటు నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ , బీజేపీ నాయ‌క‌త్వాన్ని ఏకి పారేశారు విజ‌య సాయి రెడ్డి. గ‌త కొంత కాలం నుంచీ తాను పార్టీ పెడుతున్న‌ట్లు వెళ్లడించారు. ఏపీలోని ప‌లు ప్రాంతాల‌లో కూడా ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఏపీలో త‌మ పార్టీనే ప్ర‌త్యామ్నాయం కాబోతోంద‌ని అన్నారు. ఇత‌ర పార్టీల‌న్నీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయ‌ని ఆరోపించారు.

ఒక‌ప్పుడు వైసీపీలో టాప్ లో ఉంటూ వ‌చ్చిన విజ‌య సాయి రెడ్డి ఉన్న‌ట్టుండి ఆ పార్టీకి ఝ‌ల‌క్ ఇచ్చారు. ఆయ‌న అక్క‌డ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌నే ఆ పార్టీకి కేరాఫ్ గా ఉన్నారు. ఈస‌మ‌యంలో ఉన్న‌ట్టుండి స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి త‌న‌ను టార్గెట్ చేశార‌ని ఆరోపించారు. ఆపై త‌న‌పై దాడికి పాల్ప‌డ్డాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. దీనిని ఖండించ‌లేదు పార్టీ చీఫ్‌, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపై వచ్చిన “ద్రోహి” అనే ఆరోపణలను ఆయన ఖండించారు. తాను వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మకస్థుడిగానే ఉన్నానని సాయిరెడ్డి పేర్కొన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యానే తాను రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *