Wednesday, 11 November 2026

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు గెలుచుకున్న ఏపీ

newsseals-APGovt

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రానికి ప‌లు అవార్డులు ద‌క్కాయి. 20,000 లోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో చిత్తూరు జిల్లాలోని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిద్యం వ‌హిస్తున్న‌ కుప్పం కు పుర‌స్కారం ల‌భించ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా కుప్పం ప‌ట్ట‌ణానికి స్వచ్ఛ నగరంగా ఎంపికైంది. ఈ కార్యక్రమానికి ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు కూడా హాజరు కానున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప‌ట్ట‌ణ పుర‌పాలిక శాఖ మంత్రి మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేయనున్నారు.

రాష్ట్రంలోని ఆరు మున్సిపాలిటీలకు అవార్డులు దక్కాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు సూపర్ స్వచ్ఛ లీగ్ విభాగంలో గుర్తింపు పొందాయి. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్ అవార్డును అందుకోగా, పారిశుధ్య కార్మికుల భద్రతను గుర్తించే సఫాయి మిత్ర సురక్షిత షెహర్ విభాగంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ విజయం సాధించింది. 20,000 లోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో కుప్పం మున్సిపాలిటీ స్వచ్ఛ నగరంగా ఎంపిక కావ‌డం ప‌ట్ల సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారాలోకేష్ అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు కూడా హాజరు కానున్నార‌ని ఈ సంద‌ర్బంగా మున్సిప‌ల్ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు.

రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ తీసుకున్న చర్యలకు నిదర్శనంగా, ఆంధ్రప్రదేశ్ ఈ సర్వేలో క్రమం తప్పకుండా గుర్తింపు పొందుతోందని నివేదిక పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *