Wednesday, 11 November 2026

13న పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం

newsseals-PeddaSeshaVahanam

తిరుమల : తిరుమలలో నవంబర్ 13వ తేదీన‌ నాగుల చవితి ప‌ర్వ‌దినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి దర్శనం ఇవ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి సహస్ర నామాలతో శేష సాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.

ఈ విధంగా స్వామి వారు,దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయం ఇవ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింప చేస్తాడు. శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునిదే. ఇదిలా ఉండ‌గా మ‌ల‌య‌ప్ప స్వామి ద‌ర్శ‌నం సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సాధికారిత క‌మిటీ చైర్మ‌న్ , ఈవో ముద్దాడ ర‌విచంద్ర ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి. ఈ కార్య‌క్ర‌మానికి బారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి రానున్న‌ట్లు స‌మాచారం. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *