Monday, 19 October 2026

చంద్రప్రభ వాహన సేవలో క‌ళా వైభ‌వం

newsseals-TTDCulturals

తిరుమల : తిరుమ‌ల భ‌క్త బాంధ‌వుల‌తో కళ క‌ళ లాడుతోంది. ప్ర‌స్తుతం పుణ్య క్షేత్రంలో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా దేశంలోని ప‌లు రాష్ట్రాల నుంచి క‌ళా బృందాలు త‌మ క‌ళా రూపాల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవలో 8 రాష్ట్రాలకు చెందిన 17 కళా బృందాల నుంచి 453 మంది కళాకారులు నృత్య గానాలతో స్వామి వారికి భక్తిపూర్వక కళాసేవ సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, మేఘాలయ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల కళాకారులు భరతనాట్యం, సంగ్రైన్, వంగల, గోపికా, దీప నృత్యాలు, కోలాటం తదితర సంప్రదాయ కళా రూపాలతో భక్తులను అలరించారు.

శ్రీకృష్ణ లీలలు, రామాయణం, అష్టలక్ష్మీ వైభవం, శ్రీనివాస వైభవం, శ్రీకృష్ణ తులసీ వివాహం వంటి ఆధ్యాత్మిక ఇతివృత్తాలను కళారూపాల్లో ప్రదర్శించి భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవాన్ని చాటారు. ఇదిలా ఉండ‌గా చంద్రప్రభ వాహనంపై విహరించిన శ్రీ మలయప్ప స్వామివారికి వివిధ రాష్ట్రాల కళాకారులు సమర్పించిన కళాసేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని గ‌తంలో లేని విధంగ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. స్వామి వారికి సంబంధించి నిర్వ‌హించిన గ‌రుడ సేవ‌కు భ‌క్తులు పోటెత్తారు. స‌క్సెస్ కావ‌డంతో ఇందులో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *