Saturday, 28 November 2026

టీటీడీ ప్ర‌త్యేక అధికారిగా అర్జ శ్రీ‌కాంత్

newsseals-ArjaSrikanth

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా కీల‌క ప‌ద‌విలో ఉన్న ఉన్న‌తాధికారి అర్జ శ్రీ‌కాంత్ కు మ‌రో ప్రాధాన్య‌త పోస్టును అప్ప‌గించింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు చీఫ్ సెక్ర‌ట‌రీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ మేర‌కు అర్జ శ్రీ‌కాంత్ ను తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం కు సంబంధించి స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా నియ‌మించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న దేశంలోని 4 రాష్ట్రాల్లో అదనపు బాధ్యతలు చూస్తారు. వివిధ రాష్ట్రాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేవాలయాలు పర్యవేక్షించే స్పెషల్ ఆఫీసర్‌గా డిల్లీలోని ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.

ఇందులో భాగంగా న్యూఢిల్లీ, కురుక్షేత్ర, రిషికేశ్, జమ్మూలోని శ్రీవారి ఆలయాలకు ఆయన స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అలాగే అస్సాం, ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో టీటీడీ వ్యవహారాలను సమన్వయం చేసే అదనపు బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొంది
ఆలయాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలతోపాటు సమగ్రాభివృద్ధిపై అర్జా శ్రీకాంత్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని స‌ర్కార్ పేర్కొంది. కనీసం 15 రోజులకు ఒకసారి ఈ ఆలయాలను తనిఖీ చేయాలని అర్జా శ్రీకాంత్‌ను ఆదేశించింది. దీంతో ఆయా దేవాలయాల్లో సమస్యలను గుర్తించి సిబ్బందికి టీటీడీ స్పెషల్ ఆఫీసర్‌ అర్జా శ్రీకాంత్ తగిన దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *