Saturday, 28 November 2026

2030 నాటికి బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తెలంగాణ

newsseals-SoumyaMishra

హైదరాబాద్ : 2030 నాటికి తెలంగాణను బాల్య వివాహ రహిత రాష్ట్రంగా మార్చాలంటే పటిష్టమైన నివారణ చర్యలు, సమర్థవంతమైన చట్టాల అమలు, సామూహిక సమాజ భాగస్వామ్యం అవసరమని తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా పిలుపునిచ్చారు.మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థల సహకారంతో శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేటలో గల హోటల్ ది ప్లాజాలో “బాల్య వివాహాల నిర్మూలన, బాలల లైంగిక దోపిడీ , దుర్వినియోగ సామగ్రిపై పోరాటం (CSEAM)” అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సదస్సులో ఆమె పాల్గొన్ని ప్రసంగించారు.

ఈ సమస్య తీవ్రతను హైలైట్ చేస్తూ, 2024 నుండి 2026 నవంబర్ 25 మధ్య తెలంగాణలోని 31 పోలీస్ యూనిట్ల పరిధిలో 1,497 బాల్య వివాహ కేసులు నమోదయ్యాయని డాక్టర్ సౌమ్య మిశ్రా వెల్లడించారు. ప్రతి గణాంకం వెనుక ఒక కథ ఉందని ఆమె పేర్కొన్నారు. ఒక చిన్నారి విద్య, గౌరవం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. నిశ్శబ్దమే అసలైన ప్రమాదం. నివారించబడిన ప్రతి బాల్య వివాహం, రక్షించబడిన ఒక బాల్యంతో సమానం. అనుమానిత కేసులను కూడా నివేదించడానికి పౌరులు వెనుకాడకూడదు. ఒక చిన్నారి భవిష్యత్తును కాపాడటానికి, మీరు ఒక సంఘటన గురించి ఖచ్చితంగా తెలుసు కోవాల్సిన అవసరం లేదు అని ఆమె అన్నారు.

కఠినమైన అమలుకు పిలుపునిస్తూ, కేసులను వెంటనే నమోదు చేయడం, సకాలంలో దర్యాప్తు చేయడం, సమగ్రమైన ఛార్జిషీట్లు రూపొందించడం, పెండింగ్‌లో ఉన్న కేసులను తార్కిక ముగింపున‌కు వచ్చేవరకు నిరంతరం పర్యవేక్షించడం వంటివి పోలీసు అధికారులు నిర్ధారించాలని ఆమె కోరారు. బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006 ప్రకారం బాల్య వివాహం అనేది శిక్షార్హమైన , బెయిల్ ఇవ్వడానికి వీలులేని నేరం అని కూడా ఆమె పేర్కొన్నారు. పిల్లలపై లైంగిక నేరాలు జరిగిన చోటల్లా పోక్సో (POCSO) చట్టంలోని నిబంధనలను కూడా తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు సౌమ్యా మిశ్రా. విచారణ కన్నా నివారణకే ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *