హైదరాబాద్ : భారతీయ క్రికెట్ రంగంలో అత్యంత జనాదరణ పొందిన ఆటగాడు కేరళకు చెందిన స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. నవంబర్ 11న తన పుట్టిన రోజు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో తనకు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు. ఇక శాంసన్ విషయానికి వస్తే భారత క్రికెట్‌లో ప్రతిభావంతుడైన వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్. అద్భుతమైన బ్యాటింగ్ శైలి, భారీ సిక్సర్లు, ఒత్తిడిలో ఆడే సామర్థ్యంతో అభిమానులను సంపాదించుకున్నాడు. తన పూర్తి పేరు సంజూ విశ్వనాథ్ శాంసన్. కేరళలోని తిరువనంతపురంలో నవంబర్ 11, 1994లో పుట్టాడు. భార్య చారులత రమేష్. చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి చూపించాడు. ఆయన తండ్రి శాంసన్ విశ్వనాథ్ పోలీస్ విభాగంలో పనిచేశారు. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌లో శిక్షణ పొందారు. ఢిల్లీలో కూడా కొంతకాలం క్రికెట్ సాధన చేశాడు శాంసన్. ఆ తర్వాత కేరళ తరపున ప్రాతినిద్యం వహించాడు.
సంజూ శాంసన్ తన ప్రతిభతో చిన్న వయస్సులోనే గుర్తింపు పొందారు. 2011లో కేరళ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున లో తను ఆడటం ప్రారంభించాడు 2015లో భారత అంతర్జాతీయ T20 జట్టులో అరంగేట్రం చేశాడు. 2021లో వన్డే లో ఆడాడు. 2013లో ఐపీఎల్ లో ఎమర్జింగ్ ప్లేయర్ గా అవార్డు పొందాడు. 2021లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయ్యాడు. 2022లో ఆ జట్టును ఫైనల్స్ దాకా తీసుకు వెళ్లాడు. 2024లో 531 పరుగులు సాధించి టాప్ లో నిలిచాడు. 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడాడు. చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాడు.
2023లో దక్షిణాఫ్రికాపై తొలి వన్డే సెంచరీ చేశాడు. .2024లో బంగ్లాదేశ్‌పై T20 సెంచరీ బాదాడు. ఇదే ఏడాదిలో దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు T20 సెంచరీలు సాధించి రికార్డ్ సృష్టించాడు సంజు శాంసన్.
ఒకే క్యాలెండర్ సంవత్సరంలో మూడు T20 అంతర్జాతీయ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందారు.2024లో భారతదేశం T20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సంజూ శాంసన్ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆ టోర్నమెంట్‌లో తనకు ఆడే అవకాశం రాలేదు. 2026 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ తన ప్రతిభను చాటుకున్నారు. కీలకమైన మ్యాచ్‌లలో భారీ పరుగులు చేసి భారత విజయానికి తోడ్పడ్డారు. టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నారు.




