హైదరాబాద్ : తనపై సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ కు తన అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఆన్సర్ ఇచ్చాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. స్వదేశంలో వెస్టిండీస్ తో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన 4వ టి20 మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించాయి. సిక్సర్లు, ఫోర్లు లెక్కలేనన్ని వచ్చాయి. ఇరు జట్ల ఆటగాళ్లు రెచ్చిపోయారు. క్రికెట్ అభిమానులకు కనువిందు చేశారు. భారత జట్టు చివరి దాకా చేసిన పోరాటం ఫలించలేదు. ఈ కీలక మ్యాచ్ లో టీమిండియా ఓటమి చవి చూసింది. కానీ ఈ మ్యాచ్ లో విండీస్ జట్టు స్కిప్పర్ సూపర్ సెంచరీతో రెచ్చి పోయినప్పటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం ఒకే ఒక్కడు స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ మాత్రమేనని చెప్పక తప్పదు. విండీ స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కంటి మీద కునుకు లేకుండా చేశాడు సంజు శాంసన్. దీంతో ఇరు జట్లు 2-2 తో సమం అయ్యాయి. ఇంకో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది.
భారత్ , వెస్టిండీస్ మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ సంజు శాంసన్‌కు మిశ్రమ అనుభవాన్ని మిగిల్చింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన తను 23 బంతుల్లోనే 56 పరుగులు (మూడు ఇన్నింగ్స్‌లలో ఇది అతని రెండో అర్ధశతకం) సాధించాడు. అయితే, భారత్ 24 పరుగుల తేడాతో ఓడి పోవడంతో ఈ అద్భుత ఇన్నింగ్స్ ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఇక కీలకమైన మ్యాచ్ శనివారం జరగనున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్‌కు శాంసన్ నుంచి మరో అద్భుత ప్రదర్శన అవసరం కానుంది. తన బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నప్పటికీ, భారత్ గెలిచి ఉంటే బాగుండేదని శాంసన్ పేర్కొన్నాడు మ్యాచ్ అనంతరం.
ఏం చేసినా, ఓడిపోయిన జట్టులో ఉండటం చాలా భిన్నంగా, బాధాకరంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నేను చాలా నిరాశగా ఉన్నాను. నా సహకారంతో జట్టు గెలవాలని కోరుకున్నాను. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాగానే అనిపించింది, కానీ అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు వేరే ఆలోచనలకు తావుండదు. సహజ సిద్ధమైన ఆటపై, మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచాలి; నేను అదే చేశాను. నా ఇన్నింగ్స్‌ను నేను ఆస్వాదించాను, కానీ గెలిచిన జట్టులో ఉంటే ఇంకా బాగుండేది అని అన్నాడు. మరికొన్ని




