Thursday, 15 October 2026

ఎల్ నినో ప్ర‌భావం జ‌ర భ‌ద్రం : సీఎం

newsseals-revanth

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో తీవ్ర‌మైన క‌రువు నెల‌కొంద‌న్నారు. ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావం, కరువు వంటి పరిస్థితులు , రాబోయే కరువు ముప్పుపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ , తాగునీటి సమస్యలు తీవ్రతరం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు .ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా పకడ్బందీ ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ‘ఎల్ నినో’ ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రతి మండలానికి గ్రూప్-1 , గ్రూప్-2 స్థాయి అధికారులను నియమించి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (Chief Secretary) అందజేస్తూనే, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు క‌రువు నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు కృషి చేయాల‌ని స్ప‌స్టం చేశారు . ఇప్ప‌టికే ఎల్ నినో ప్ర‌భావం గురించి తాను ప‌దే ప‌దే కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ చేస్తూ వ‌చ్చాన‌ని అన్నారు. ముందు జాగ్ర‌త్త ప‌డ‌క పోతే రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు సీఎం. ఇక నుంచి పూర్తి జాగ్ర‌త్త‌త‌తో ఉండాల‌ని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *