ఏపీని క్రీడా హ‌బ్ గా మార్చేందుకు స‌హ‌క‌రించండి

అమ‌రావ‌తి : ఏపీని క్రీడా కేంద్రంగా మార్చేందుకు జై షా మద్దతు కోరారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ఆధునిక మౌలిక సదుపాయాలు, క్రీడా సాంకేతికత, యువత నైపుణ్యాభివృద్ధిని అనుసంధానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయి క్రీడా కేంద్రంగా (స్పోర్ట్స్ హబ్) తీర్చిదిద్దేందుకు సహకరించాలని అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చైర్మన్ జై షాను కోరారు. అంతర్జాతీయ క్రికెట్ రంగంలో జై షా నాయకత్వాన్ని లోకేష్ అభినందించారు. ముఖ్యంగా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించడం, రికార్డు స్థాయి ఐపీఎల్ (IPL) మీడియా హక్కులను సాధించడం, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)ను ప్రారంభించడం, మహిళా క్రికెటర్లకు సమాన వేతనం లభించేలా చూడటంలో ఆయన పోషించిన పాత్రను లోకేష్ ప్రశంసించారు. అలాగే విశాఖపట్నాన్ని ఒలింపిక్ క్రీడల నిర్వహణలో భాగస్వామిగా (ముఖ్యంగా సెయిలింగ్, రోయింగ్, విండ్‌సర్ఫింగ్, ఓపెన్-వాటర్ స్విమ్మింగ్ , బీచ్ వాలీబాల్ వంటి వాటర్ స్పోర్ట్స్ కోసం అభివృద్ధి చేయడానికి మద్దతు ఇవ్వాల‌ని విన్న‌వించారు.

అమిత్ షా ప్రారంభించిన ‘గాంధీనగర్ ప్రీమియర్ లీగ్’ స్ఫూర్తితో, రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘అసెంబ్లీ ప్రీమియర్ లీగ్’ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోందని నారా లోకేష్‌ తెలిపారు. దీని ద్వారా యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం , క్షేత్రస్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించడం లక్ష్యమని పేర్కొన్నారు. మంగళగిరి ప్రీమియర్ లీగ్ (MPL) గురించి కూడా ఆయన ప్రస్తావించారు, ఇది ఇటీవల 128 స్థానిక జట్లను ఒకచోట చేర్చిందని చెప్పారు. WPL , జాతీయ జట్టు కోసం ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లను గుర్తించి, వారిని తీర్చిదిద్దేందుకు మంగళగిరిలో ‘ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్’ (WAPL)ను ఇటీవల ప్రారంభించినట్లు చెప్పారు. దీనికి మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. . ఈ ప్రారంభ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించబడిందని ఆయన పేర్కొన్నారు.

  • Related Posts

    ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా ల్యూక్ విలియమ్స్

    ముంబై : ఐపీఎల్ 2027లో పోటీ ప‌డ‌నున్న ముంబై ఇండియ‌న్స్ జట్టుకు హెడ్ కోచ్ గా ల్యూక్ విలియ‌మ్స్ వ్య‌వ‌హ‌రిస్తాడు. 2025లో బాధ్యతలు చేపట్టిన లీసా కీట్లీ ఆ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027…

    ప్ర‌తిభ క‌న‌బర్చిన‌ సాయి కుమార్ కు కంగ్రాట్స్

    తాడేప‌ల్లి గూడెం : ఈ నెల 9-13 తేదీల్లో మర్కాపురంలో జరిగిన 11వ ఏపీ స్టేట్ సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డుతో పాటు థర్డ్ ప్లేస్ సాధించడ‌మే కాకుండా ఏపీ నుంచి జాతీయ పోటీలకు ఎంపికైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *