బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భారత మెన్స్ హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. కర్ణాటక మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీ నిరంతర విజయాలకు మా శుభాకాంక్షల అని శివకుమార్ అన్నారు. భారతదేశానికి స్వర్ణం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు కర్ణాటక ముఖ్యమంత్రి ఆదివారం ప్రశంసలతో ముంచెత్తారు. మిమ్మల్ని, మీరు సాధించిన గెలుపును చూసి జాతి యావత్తు గర్విస్తోందని పేర్కొన్నారు . జట్టులోని ముగ్గురు సభ్యులు కర్ణాటకకు చెందినవారు కావడం గర్వ కారణమని ఆయన అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ స్వర్ణం సాధించడం గర్వకారణం, విజేత జట్టులోని ముగ్గురు సభ్యులు కర్ణాటకకు చెందిన వారు ఉండడం మరింత సంతోషంగా ఉందన్నారు.
గోల్ కీపర్, వీడియో అనలిస్ట్ , హెడ్ ఫిజియోథెరపిస్ట్‌గా విలువైన సేవలు అందించిన మోహిత్ హెచ్ ఎస్, హర్షిత్ ఎం లక్ష్మణ్ , రంగనాథన్ ఎం లకు హృదయపూర్వక అభినందనలు అని ఆయన తెలిపారు. కర్ణాటక మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీ నిరంతర విజయాలకు మా శుభాకాంక్షలు అని శివకుమార్ అన్నారు. ప్రస్తుత ఒలింపిక్ కాంస్య పతక విజేత భారత్, శనివారం ఆసియా క్రీడల్లో మలేషియాను 5-1 తేడాతో చిత్తు చేసి పురుషుల హాకీ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంతో వారికి 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత లభించింది. భారత హాకీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, ఎనిమిదిసార్లు ఒలింపిక్ ఛాంపియన్లు తమ ఐదవ ఆసియా క్రీడల స్వర్ణాన్ని, వరుసగా రెండవ స్వర్ణాన్ని మొదటిసారిగా కైవసం చేసుకున్నారు.







