చంచల్ గూడ సూపరింటెండెంట్ పై ఓవైసీ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : ఎంఐఎం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు , హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యుడు అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏకంగా హైద‌రాబాద్ లోని చంచ‌ల్ గూడ జైలు సూపరింటెండెంట్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆదివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. త‌న వ్య‌వ‌హార‌శైలిపై అభ్యంత‌రం తెలిపారు. సూపరింటెండెంట్‌కు లంచం ఇచ్చి న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేసిన రౌడీషీటర్ బెయిల్ తెచ్చుకున్నాడని ఆరోపించారు అస‌దుద్దీన్ ఓవైసీ. ఇందుకు సంబంధించి త‌మ వ‌ద్ద ప‌క్కా ఆధారాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పందించాల‌ని అన్నారు ఎంపీ.

అడ్వొకేట్ హత్య కేసులో ఇటీవల విడుదలైన రౌడీషీటర్‌కు చంచ‌ల్ గూడ‌ జైలు సూపరింటెండెంట్ బ‌హిరంగంగానే మ‌ద్ద‌తు ఇస్తున్నాడ‌ని, త‌న‌ను ఇత‌రుల‌పై దాడుల‌కు పాల్ప‌డేందుకు సహకరిస్తున్నాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో రెచ్చి పోతున్నాడ‌ని ఆయ‌న రౌడీ షీట‌ర్ ను టార్గెట్ చేశాడు. జైలు సూప‌రింటెండెంట్ ను అడ్డం పెట్టుకుని దాడుల‌కు పాల్ప‌డేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ని ఆరోపించారు. జైలు సూపరింటెండెంట్‌కు రూ.2 కోట్లు లంచం ఇచ్చి నిందితుడు బెయిల్ తెచ్చుకున్నాడ‌ని ఫైర్ అయ్యారు అస‌దుద్దీన్ ఓవైసీ. అమాయకులపై హత్యలకు పాల్పడే వారిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

  • Related Posts

    కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎన్నిక‌లు

    హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ (TS HOUSEFED) ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు జోన్ల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడ్డారు. మొత్తం 86 శాతం…

    యూనివ‌ర్శిటీలు సాంస్కృతిక వారసత్వానికి నిలయాలు

    హైద‌రాబాద్ : భార‌త దేశ మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలోని విశ్వ విద్యాల‌యాలు సాంస్కృతిక వార‌స‌త్వానికి నిల‌యాలుగా మారాయ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. సూర్యవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన ‘ప్రతిభా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *