Wednesday, 18 November 2026
Trending

సిద్దిపేట‌లో సీఎం స‌భ స‌క్సెస్ చేయాలి

newsseals-Damodaraa

మెద‌క్ జిల్లా : మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట లో బుధ‌వారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా జరుగుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. స‌భ‌ను స‌క్సెస్ చేయాల‌ని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సభావేదిక స్థలాన్ని, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పర్యటన లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం , రూ.544.11 కోట్ల తో చేపట్టనున్న అభివృద్ధి, శంకుస్థాపనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలి రానున్నార‌ని తెలిపారు. ఈ నేపథ్యం లో వేదిక ఏర్పాట్లు, కుర్చీలు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతరాయ విద్యుత్తు, సౌండ్ సిస్టమ్, మెడికల్ క్యాంపు, అంబులెన్స్ లు , హెలిప్యాడ్ , ముఖ్యమంత్రి గారి పాదయాత్ర, వాహన పార్కింగ్ ఏర్పాట్ల పై మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్, అధికారులతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌న్నారు. ప్ర‌జా ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌న్నారు దామోద‌ర .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *