ముంబై : ఐపీఎల్ 2027లో పోటీ పడనున్న ముంబై ఇండియన్స్ జట్టుకు హెడ్ కోచ్ గా ల్యూక్ విలియమ్స్ వ్యవహరిస్తాడు. 2025లో బాధ్యతలు చేపట్టిన లీసా కీట్లీ ఆ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు ముందు లీసా కీట్లీతో విడిపోయిన ముంబై ఇండియన్స్ గురువారం ల్యూక్ విలియమ్స్‌ను తమ ప్రధాన కోచ్‌గా నియమించింది. లీసా కీట్లీ ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని, ఆమె స్థానంలో 2027 మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్‌కు ముందు ల్యూక్ విలియమ్స్ నియమితులయ్యారని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో పేర్కొంది. మాజీ ఆస్ట్రేలియన్ బ్యాటర్ కీట్లీ కోచ్‌గా ఉన్న సమయంలో, రెండుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్, ఐదు జట్ల టోర్నమెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.
టోర్నమెంట్ నాలుగు సీజన్లలో ఇదే వారి అత్యంత పేలవమైన ప్రదర్శన. ముంబై ఇండియన్స్ 2023 మరియు 2025లో WPL టైటిల్స్ గెలుచుకోగా, 2024లో ఎలిమినేటర్ దశలో నిష్క్రమించింది. కలిసి ఏదైనా గొప్పగా నిర్మించడానికి, ఉత్కంఠ భరితమైన క్రికెట్ ఆడటానికి , విజయాల కోసం పోటీపడటానికి మాకు గొప్ప అవకాశం ఉంది అని విలియమ్స్ అన్నారు. గతంలో WPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి టైటిల్ గెలుచుకున్నప్పుడు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. అలాగే ‘ది హండ్రెడ్’లో సదరన్ బ్రేవ్ ఉమెన్, ‘ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్’లో అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ జట్లకు కోచ్‌గా, BBLలో పురుషుల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా పనిచేశారు.







