Monday, 9 November 2026

రూ. 400 కోట్ల క్ల‌బ్ లోకి రామాయ‌ణం

newsseals-Ramayanam

ముంబై : మ‌నీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం రామాయ‌ణం. విడుద‌లైన‌ప్ప‌టి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ప్ర‌స్తుతం క‌లెక్ష‌న్ల ప‌రంగా చూస్తే ఏకంగా రూ. 400 కోట్ల క్ల‌బ్ లోకి చేరువ‌లో ఉన్న‌ట్లు టాక్. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా వసూళ్లు భారీగా పెరిగాయి. రామాయణం’ తొలి రెండు రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర మరింత బలంగా నిలబడింది. గురువారం విడుదలైన ఈ సినిమా మూడో రోజుకే తన బెస్ట్ నంబర్స్ నమోదు చేసింది. మొదటి రోజు వచ్చిన భారీ ఓపెనింగ్‌ను కూడా కలెక్షన్స్ దాటేయడం హైలెట్. హిందీ మార్కెట్‌లో మల్టీప్లెక్స్‌లు బలంగా ఉండగా, సౌత్ డబ్బింగ్ వెర్షన్లు కూడా రెండో రోజు నుంచి పుంజుకున్నాయి. ఓవర్సీస్‌లో అయితే మూడో రోజు సినిమా మరింత భారీగా కలెక్షన్లు సాధించింది. దీంతో ఓవరాల్​గా మూడురోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా రూ. 375.50 కోట్లు దాటినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.102 కోట్ల గ్రాస్ చేసిన ‘రామాయణ’, మూడో రోజు రూ.145 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనా. ఇందులో హిందీ వెర్షన్ ఒక్కటే రూ.50 కోట్లకు పైగా నెట్ సాధించగా, సౌత్ డబ్బింగ్ వెర్షన్ల నుంచి దాదాపు రూ.20 కోట్ల నెట్ వచ్చినట్లు సమాచారం. వచ్చిన మొత్తం మొదటి రోజు ట్రేడ్ ఫిగర్ కంటే ఎక్కువ. రిలీజ్ రోజు ఆసక్తితో వచ్చిన ఓపెనింగ్ తర్వాత కూడా సినిమా తగ్గకుండా, మూడో రోజుకే మరింత పైకి వెళ్లడం వీకెండ్ బిజినెస్‌కు పెద్ద ప్లస్‌ అని చెప్పవచ్చు. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా సినిమా బాగా ఆడింది. మూడో రోజు ఓవర్సీస్ వసూళ్లు 6.5 నుంచి 7 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా నార్త్ అమెరికా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో మంచి రెస్పాన్స్ వస్తోందని ట్రేడ్ సమాచారం. ఇండియన్ మార్కెట్‌లో హిందీ వెర్షన్ బలం ఇస్తుండగా, విదేశాల్లో కూడా సినిమా పెద్ద స్థాయిలో నడవడం మొత్తం వరల్డ్‌వైడ్ నంబర్‌ను పైకి తీసుకెళ్లింది. భారీ విజువల్స్, 3డీ ఐమ్యాక్స్ షోలకు ఉన్న ఆసక్తి కూడా అక్కడ ఉపయోగపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *