Monday, 9 November 2026

త‌ను నా ఆఫ‌ర్ ను రిజెక్ట్ చేశారు : సూర్య

newsseals-SuriyaNaziya

హైద‌రాబాద్ : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సీన్’ చిత్రం జ‌నాద‌ర‌ణతో దూసుకు పోతోంది. విడుద‌లైన రోజు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో మ‌ళ‌యాలం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టి న‌జియా న‌జ్రీమ్ కీ రోల్ పోషించింది. త‌న నట‌న‌కు జ‌నం ఫిదా అవుతున్నారు. ఈ ఏడాది సూర్య‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. ఈ సందర్భంగా న‌టుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు త‌న తోటి న‌టిమణి గురించి. త‌ను నాతో న‌టించేందుకు చాలాసార్లు ఆఫ‌ర్ ఇచ్చినా ఎందుక‌నో తెలియ‌దు రిజెక్ట్ చేసిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. అయితే దీనిపై నజ్రియా తాజాగా కేరళ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో వివరణ ఇచ్చారు. సూర్య సినిమాలో నటించడం తన కల అని ఆమె అన్నారు. ఛాన్స్ వచ్చినా చేయలేక పోవడం వెనుక ఉన్న కారణాన్ని తెలియజేశారు.

‘సూర్య సార్ సినిమాలను నేను మూడు సార్లు రిజెక్ట్ చేశానని ఆయన చెప్పిన మాటలు ఒక జోక్ మాత్రమే. అసలు సూర్య సినిమాలో ఆఫర్​ను నేను ఎలా వదులుకోగలను చెప్పండి . ఆ సమయంలో ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాను. అందువల్ల డేట్స్ సర్దుబాటు కాలేదు. ఈ కారణంగానే ఆయన సినిమాల్లో నటించలేక పోయాన‌ని పేర్కొన్నారు. అంతేకానీ రిజెక్ట్ చేయలేదని స్ప‌ష్ట‌త ఇచ్చారు న‌జియా న‌జ్రీమ్. 12 ఏళ్ల విరామం తర్వాత సీన్​తో మళ్లీ తమిళంలో నటించడం ఆనందంగా ఉంద‌న్నారు. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సూర్యనే కారణం అన్నారు. ఆయనతో కలిసి నటించాలనే కల ఈ సినిమాతో నిజం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు న‌జియా .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *