ముంబై : అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాకా. దీనిని సన్ పిక్చర్స్ యాజమాన్యం నిర్మిస్తోంది. బన్నీ, అట్లీల కాంబోలో వస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా కొనసాగుతోంది. అయితే దీపావళి పండుగకు కూడా చిత్ర యూనిట్ ఎలాంటి విరామం తీసుకోకుండా షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆడియెన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక అల్లు అర్జున్ మాత్రం ఒక్కరోజు దీపావళి సందర్భంగా చిన్న బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ మూవీ టీమ్ మాత్రం గ్యాప్ తీసుకోకుండానే కష్టపడుతున్నారని టాక్. దీంతో మూవీ టీమ్ హార్డ్ వర్క్‌ను గుర్తించిన అల్లు అర్జున్ వారందరికీ అదిరిపోయే ఒక స్పెషల్ సర్ప్రైజ్ను ఇచ్చారట.
పండుగ రోజుల్లో కూడా రాకా సినిమాపై డెడికేషన్‌తో వర్క్ చేస్తున్న మూవీ టీమ్ పట్ల అల్లు అర్జున్ తన ప్రేమను వ్యక్తం చేశారు. దీపావళి రోజున పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ.10 వేల బోనస్‌తో పాటు, ఒక ప్రత్యేకమైన దీపావళి గిఫ్ట్ హ్యాంపర్‌ను బన్నీ పంపించారని సమాచారం. అంతేకాకుండా, పండుగ రోజున షూటింగ్‌లో పాల్గొన్నందుకు వారికి మేకర్స్ ట్రిపుల్ బేటాను సైతం ఇస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాల టాక్ నడుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు భాగస్వామ్యమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన నిపుణుల షెడ్యూల్స్ వృథా కాకూడదనే ఉద్దేశంతోనే, పండుగ రోజుల్లో కూడా బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలిసింది. చిత్ర బృందంలోని చాలా మంది టెక్నీషియన్లు కోలీవుడ్‌కు చెందిన వారు కూడా ఉండటం, ఈ పండుగ సమయంలో వారు తమ ఇళ్లకు వెళ్లే అవకాశం లేక పోవడంతో నిరంతరాయంగా వర్క్ చేస్తున్నారట. ఈ క్రమంలో వారి కష్టాన్ని గుర్తించిన అల్లు అర్జున్ వారికి బోనస్‌తో పాటు గిప్ట్ హ్యాంపర్లను పంపించినట్లు సమాచారం.




